హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డు కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో నీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని.. నగర ప్రజలు పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు (Hyderabad Water Board) కీలక సూచనలు జారీ చేసింది. నీటి పొదుపు ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. నీరు, విద్యుత్తు వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని.. ప్రజల కంటే ముందే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు.

5 తరువాత ఏసీల నిలిపివేత..

హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని కార్యాలయాల్లో ఏసీలను 25 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఉంచాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. అంతేగాకుండా సాయంత్రం 5 గంటల తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగం పూర్తిగా నిలిపేయాలన్నారు. అత్యవసరంగా వినియోగించాల్సి వస్తే.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. ఏసీల నుంచి వెలువడే నీరు వృథాగా పోకుండా.. మొక్కలు, చెట్లకు పైపుల ద్వారా మళ్లించాలని చెప్పారు.

లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేసి పోవద్దు..

ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు, లైట్లు, ఫ్యాట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించుకోని సమయంలో కచ్చితంగా ఆఫ్ చేయాలని అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయాలు ముగిసిన తరువాత లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేసి వెళ్లపోవద్దన్నారు. విద్యుత్తు పొదుపును ప్రతి ఉద్యోగి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రతి రోజూ జరిగే చూడాలన్నారు. ఉద్యోగులు మారినప్పుడే సమాజంలో కూడా మార్పు సాధ్యమవుతుందన్నారు. పొదుపు మంత్రం కచ్చితంగా పాటించే అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు కూడా అందిస్తామన్నారు.

Also Read : మ‌రో వివాదంలో చిక్కుకున్న “ఇడుపుకాయితం”!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>