కలం, నిర్మల్ : స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, వృత్తి పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభకు నిర్మల్ (Nirmal) పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు శనివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సంఘం పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ శ్రీరామోజు నరేష్ మాట్లాడుతూ.. స్వర్ణకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి స్వర్ణకారునికి నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారుల వృత్తి పరిరక్షణకు, ఆర్థిక భరోసాకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇందులో కార్యదర్శి అన్వేష్, కోశాధికారి నర్సింహ చారి, సంఘ సభ్యులు ఉన్నారు.

