ముంబై ఇండియన్స్ బాస్.. ఇక కీరన్ పొలార్డ్!

కలం, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ శనివారం ఒక సంచలన ప్రకటన చేసింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జట్టు కొత్త హెడ్ కోచ్‌గా మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ (Kieron Pollard) ను నియమించింది. బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న పొలార్డ్‌కు ఇప్పుడు ప్రధాన కోచ్‌గా ప్రమోషన్ దక్కింది. ఈ నెల ప్రారంభంలో మహేళ జయవర్ధనే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాంతో ఆ పదవి ఖాళీగా ఉంది. జయవర్ధనే ముంబై ఇండియన్స్‌కు రెండు విడతల్లో కోచ్‌గా వ్యవహరించారు.

మొదటిసారి 2017 నుంచి 2022 వరకు, రెండోసారి 2024 నుంచి 2026 వరకు ఆయన సేవలందించారు. పొలార్డ్ ప్రయాణం 2010 ఐపీఎల్ వేలంలో ముంబై జట్టులోకి రావడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన సుదీర్ఘకాలం పాటు ఆటగాడిగా కొనసాగారు. 2022 నవంబర్‌లో ఐపీఎల్ పోటీలకు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించారు. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ అయిన ఆయన ముంబై తరఫున 2013, 2015, 2017, 2019, 2020లలో ఐదుసార్లు ట్రోఫీలు గెలిచారు.

రిటైర్మెంట్ ముగిసిన వెంటనే పొలార్డ్ కొత్త బాధ్యతలు చేపట్టారు. 2023 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. ఇప్పుడు ఏకంగా హెడ్ కోచ్ స్థాయికి చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఎంపిక కావడంపై పొలార్డ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి దక్కడం తనకెంతో గౌరవంగా ఉందని వ్యాఖ్యానించారు. తన జీవితంలోనూ, కెరీర్‌లోనూ ముంబై ఇండియన్స్ చాలా ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.

ఆటగాళ్లతో, అభిమానులతో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఆటగాడిగా, కోచ్‌గా పొందిన అనుభవంతో జట్టు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నీతా అంబానీ, ఆకాష్ అంబానీలతో పాటు ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి జట్టు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>