ఎండిన ఎస్సారెస్పీ కాలువలు.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఆగ్రహం!

కలం, వరంగల్‌: ఎస్సారెస్పీ ప్రధాన కాలువల్లో నీరు లేక ఎండిపోవడంపై బీఆర్ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వరంగల్‌ (Warangal) పరిధిలోని ఆరేపల్లి వద్ద ఎండిపోయిన ఎస్సారెస్పీ కాలువల (SRSP Canals) ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సమయంలోనూ కాలువల్లో నీరు అందించలేకపోయారని వారు ఆరోపించారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్‌ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి విషయంలో చేతులెత్తేసిందని ఆరోపించారు. రైతులకు, ప్రజలకు నీటి అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ముంబై ఇండియన్స్ బాస్.. ఇక కీరన్ పొలార్డ్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>