అల్లూరి జిల్లాలో భారీ పేలుడు: ఆరుగురు మృతి

కలం, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట (Pinakota) సమీపంలోని ఒక మైనింగ్ ప్రాంతంలో శనివారం భారీ పేలుడు (Mining Explosion) సంభవించింది. మైనింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి అక్కడ ఉన్న ఒక టిప్పర్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానిక యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడుకి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : తాడిపత్రిలో హై టెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>