వంగపహాడ్‌ పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ధ్వంసం!

కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (Vangapahad ZPHS)లో గుర్తుతెలియని వ్యక్తులు కంప్యూటర్‌ ల్యాబ్‌ను ధ్వంసం చేశారు. రాత్రి వేళ ల్యాబ్‌ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు కొత్త సీపీయూలు, మానిటర్లు, ఇతర పరికరాలను పాడుచేసినట్లు ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లపై, ల్యాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో మూత్రం పోసి, హార్పిక్‌ వంటి రసాయనాలు చల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిధులతో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను ధ్వంసం చేయడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి, పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>