నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు… ఏం జరగబోతోంది?

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) నేడు హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. కేవలం రెండున్నర గంటల స్వల్ప వ్యవధి ప్రాతిపదికన సాగనున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. అనంతరం అక్కడ కేటాయించిన అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకొని, రాత్రి 8:30 గంటల ప్రాంతంలోనే తిరిగి విజయవాడకు పయనం కానున్నారు.

అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక ప్రధాన కారణాలపై విభిన్న ప్రచారాలు సాగుతున్నాయి. జన్ పథ్ లో జరగనున్న ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు, సమయం లభిస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా చంద్రబాబు కలిసే అవకాశముందని సమాచారం. ఇటీవల ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న కీలక రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన ముడిపడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీనికితోడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృధ్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల అంశాలపై కూడా అగ్రనేతలతో ప్రాథమికంగా చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రంలో భద్రత, రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో సీఎం హుటాహుటిన ఢిల్లీ బాటపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరింత స్పష్టమైన అధికారిక షెడ్యూల్ వెలువడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>