గడ్డపోతారం గ్యాస్ లీక్‌.. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం(Gaddapotharam) గ్రామంలోని సరాక పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మరికొందరు కార్మికులు అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు విచారణ జరుపుతున్నారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ప్రమాదం జరిగిన కంపెనీకి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  (Gudem Mahipal Reddy) .. మృతి చెందిన కార్మికులు సుదర్శన్ రావు (27), బాలాజీ (44) కుటుంబాలకు రూ.70 లక్షల పరిహారం అందించేలా చొరవ తీసుకున్నారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపి పరిహారం అందించేందుకు ఒప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధికి పటాన్‌చెరు ప్రాంతం కీలక కేంద్రంగా ఎదుగుతున్నప్పటికీ, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం ఉత్పత్తి, లాభాల పెరుగుదల మాత్రమే కాదని, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణానికి భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>