రామ వైభవానికి తగ్గట్టుగా భద్రాద్రి పునర్నిర్మాణం: త్రిదండి దేవనాథ

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam)లోని ప్రసిద్ధ శ్రీరామచంద్రుని ఆలయాన్ని భక్త రామదాసు ఆశయాలకు తగినట్లుగా పునర్నిర్మించాలని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి కోరారు. శుక్రవారం ఆయన భద్రాద్రిలో స్వామివారిని దర్శించుకున్నారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఆలయ పునర్నిర్మాణ పనులు మరింత వేగంగా సాగాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారామ చంద్ర స్వామివారి వైభవానికి తగ్గట్టుగా భద్రాద్రి పునర్నిర్మాణం జరగాలని కోరారు.

నిర్మాణం జరిగే సమయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, భక్తులందరూ ఈ బృహత్ కార్యంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ​భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సులభంగా దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. రాబోయే శ్రీరామనవమి నాటికి లేదా 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం శ్రీరాముడి దయతో విజయవంతం కావాలని జీయర్ స్వామి ఆశీర్వదించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>