ఆంగ్ల నైపుణ్యంతోనే అంతర్జాతీయ అవకాశాలు: ఎంజీయూ వీసీ

‎‎కలం, నల్లగొండ: ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ (MGU VC Khaja Altaf Hussain) సూచించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఇంగ్లిష్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ ఎక్స్‌ప్రెషన్‌’ పాఠ్యపుస్తకాన్ని శుక్రవారం వర్సిటీలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అంజిరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వీసీ ఖాజా అల్తాఫ్ మాట్లాడుతూ.. ఆంగ్లాన్ని కేవలం పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే పాఠ్యాంశంగా మాత్రమే చూడకూడదని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను సాధించేందుకు దోహదపడే ముఖ్యమైన నైపుణ్యంగా అభ్యసించాలని పిలుపునిచ్చారు. సాహిత్యాధ్యయనం విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను, సామాజిక బాధ్యతను, నైతికతను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే ఈ పాఠ్యపుస్తకాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దిన సంపాదకులను, రచయితలను,  సహకరించిన బృందాన్ని వీసీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ పాఠ్యపుస్తకానికి డాక్టర్‌ కె. అరుణప్రియ, ప్రొఫెసర్‌ బి. విజయ సంపాదకులుగా వ్యవహరించగా.. డాక్టర్‌ రాహత్‌ ఖానం, బి. లీలారాణి, లెఫ్టినెంట్‌ సీహెచ్‌. సుధాకర్‌ రచయితలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>