మైనర్ బాలికపై నేరం.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

కలం, నిర్మల్‌: మైనర్‌ బాలికపై నేరానికి పాల్పడిన కేసులో నిందితుడు పఠాన్‌ షరూక్‌కు నిర్మల్‌ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. భైంసా పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022లో నమోదైన పోక్సో కేసులో(Bhainsa POCSO Case) విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

ఈ కేసులో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. ప్రవీణ్‌ కుమార్‌ దర్యాప్తు చేపట్టగా, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏ. సుదర్శన్‌ రెడ్డి కోర్టులో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించారు. కోర్టు లైజన్‌ ఎస్ఐ కె. రమేష్‌, కేడీవో కె. మోహన్‌ విచారణకు సహకరించారు. మైనర్‌ బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీస్‌ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించి, నేర నిరూపణకు కృషి చేసిన దర్యాప్తు అధికారి, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, కోర్టు విధుల సిబ్బందిని ఆమె అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>