కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ (SP Rohith Raju) రాజు శుక్రవారం కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను (Bhadadri Kothagudem Police) ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరకగూడెం పీఎస్‌లో రికార్డులు, ఆయుధాలు, కిట్ ఆర్టికల్స్, సీసీటీఎన్‌ఎస్ నమోదును పరిశీలించారు. ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మెసులుకుంటూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు.
గంజాయి రవాణా, జూదం, పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పీఎస్‌లలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి, వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, నాగబాబు, ఎస్సై పి.వి.ఎన్. రావు, సిబ్బంది పాల్గొన్నారు.

