ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఎల్ నినో పరిస్తితుల దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరువు పరిస్థితులను (Telangana Drought) ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంపై దృష్టి సారించాలని సూచించింది. జాబ్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించింది. 125 రోజుల ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. జాబ్ కార్డుల్లో 18 ఏళ్ళు నిండిన కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్‌-కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>