ఏఐకేఎస్ జాతీయ మహాసభలకు రైతు సంఘం పిలుపు

కలం, నిర్మల్: నవంబర్ 18 నుంచి 21 వరకు నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను (AIKS National Conference) జయప్రదం చేయాలని.. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగెల్లి నర్సయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా రైతు సంఘం జాతీయ నాయకులతో పాటు సుమారు 1,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని నాగెల్లి నర్సయ్య తెలిపారు. అలాగే లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై చర్చించి, రైతాంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడంతో పాటు నూతన జాతీయ కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు క్లెమెంట్ వెస్లీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>