పట్టభద్రుల ఎమ్మెల్సీ.. సీపీఐ మద్దతు కోరాం: TPCC చీఫ్

కలం, వెబ్ డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ పార్టీని కాంగ్రెస్ మద్దతు కోరినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు.  చర్చలు సానుకూలంగా జరిగాయని అన్నారు. ఎన్నికలపై ఇప్పటికే సీపీఎం పార్టీ తో కూడా చర్చలు జరిపామని తెలిపారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇరు పార్టీల నేతల సమావేశం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు. అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ మాట్లాడారు.

ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి ఉన్నారు. సీపీఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) సైతం మాట్లాడుతూ.. కాంగ్రెస్ చర్చలపై తాము సానుకూలంగా ఉన్నామని, అయితే నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీపై త్వరలోనే రాష్ట్ర కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ పార్టీ కమిటీ ఆమోదం తరువాతే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో జరిపిన సమావేశంలో అంతర్గత అంశాలపై చర్చించామని అన్నారు.

Also Read : కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>