కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీగా కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని అక్రమార్కులు మాయం చేస్తుండటం (CMR Rice Scam) తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో ఇప్పటివరకు 42 వేల క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం, రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు తెలిపారు. భారీగా ప్రభుత్వ ధాన్యం అక్రమంగా దారి మళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని ఓ రైస్ మిల్లు, అలాగే సిద్దిపేట జిల్లా మోతెలోని ‘భారతి ఇండస్ట్రీస్’లోనూ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రావాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

