ఏపీ ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల సంఘం (AP Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఇంకా ఎవరైనా నామినేషన్లు వేయని వారు ఉంటే సాయంత్రం 5 గంటల్లోగా వేయాలని సూచించింది. అవసరమైతే అన్ని జిల్లాల ఎస్పీలు నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులనే తీసుకెళ్లి.. వారు నామినేషన్లు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ కేంద్రానికి వచ్చి వేయకుండా వెళ్లొద్దని పోలీస్ అధికారులను ఆదేశించింది. అవసరమైతే సంబంధిత అభ్యర్థులకే నేరుగా ఫోన్లు చేసి నామినేషన్లు వేసేలా చొరవ తీసుకోవాలని పేర్కొంది. గడువులోగా అందరికీ అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

హై కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు..

తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నవారిపై కేసులు నమోదు చేయాలని వైసీపీ హై కోర్టులో పిటిషన్ వేసింది. తమ అభ్యర్థులకు భద్రత కల్పించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరంది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు అనుమతించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>