కలం, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripet) లో మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి, దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయి ఆమెను కలవడానికి రాగా పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై నిలదీయడానికి వచ్చిన మాజీ మంత్రి విడదల రజినీని చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక తోసివేయడంతో ఆమె కింద పడిపోయారు. దీంతో నన్ను చంపేస్తారా అంటూ విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైసీపీ నేతలను అడ్డుకోవడంతో పాటు, గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. గత మూడు రోజులుగా తనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం దారుణమని విడదల రజిని (Vidadala Rajini) ఆగ్రహం వ్యక్తం చేశారు. రజినిని ఎస్సై బలంగా నెట్టేశారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు ఎవరూ నామినేషన్లు వేయడానికి వీలులేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, టీడీపీ శ్రేణులు తమ పేపర్లను చించేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో చిలకలూరిపేటలో భారీగా పోలీసులను మోహరించారు. ఎస్సైతో విడదల రజిని వాగ్వాదం, ఆమెను తోసివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : కడపలో వైసీపీ భారీ ఆందోళన
Follow Us On : WhatsApp

