పోలీసులకు ప్రత్యేక అధికారాలు : ప్రభుత్వం కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : పంజాబ్‌లో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ (Punjab Drug Network)ను మూలాల నుంచి పెకిలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు హోం శాఖ పోలీసు అధికారులకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న పోలీస్ కమిషనర్లు, రేంజ్ ఇన్‌ఛార్జ్‌లు తమ పరిధిలో డ్రగ్స్ అనుమానితులపై నివారక నిర్బంధ (Preventive Detention) ఉత్తర్వులను నేరుగా జారీ చేసేందుకు పూర్తి హక్కులు కలిగి ఉంటారు.

ఐజీ ర్యాంక్ అధికారులు అందుబాటులో లేని ప్రాంతాలలో శాంతిభద్రతల నిర్వహణకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నిర్దేశించిన ప్రత్యేక పరిధిలలో ఈ నివారక నిర్బంధ అధికారాలను ఉపయోగించేందుకు ఆరుగురు సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులకు పంజాబ్ ప్రభుత్వం అధికారాలను అప్పగించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>