సరిహద్దులో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్

కలం, నేషనల్ డెస్క్ :  అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా సైనికులతో ఘర్షణలు కొనసాగుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ (ITBP DG Shatrujeet Kapoor) వెల్లడించారు. గత కొన్ని రోజులుగా సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న ఐటీబీపీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకుంటున్న సమయంలో ఐటీబీపీకి చెందిన శౌర్య కమాండోలు (ITBP Shaurya Commandos) అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారని శత్రుజీత్ కపూర్ ప్రశంసించారు.

క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరు ప్రాధాన్యాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్‌కు సంబంధించిన సరిహద్దుల్లో చైనా వైపు ఉన్న ప్రాంతం అత్యంత క్లిష్టమైన సరిహద్దుల్లో ఒకటని శత్రుజీత్ కపూర్ అంగీకరించారు. గతంలో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న తరహా ఘర్షణలను భవిష్యత్తులో సమర్థంగా ఎదుర్కొనేందుకు ఐటీబీపీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

సరిహద్దుల్లో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు భద్రతలో సిబ్బంది సంసిద్ధత, శిక్షణ, సమన్వయం కీలకమని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇకపోతే భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డీజీ శత్రుజీత్ కపూర్ వెల్లంచారు. అయితే ఈ ఘర్షణలను ధ్రువీకరిస్తూ వెలువడిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం.

Also Read : పోలీసులకు ప్రత్యేక అధికారాలు : ప్రభుత్వం కీలక నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>