పత్తి కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి.. మంత్రి తుమ్మల ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోళ్లు (Cotton Procurement) సజావుగా నిర్వహించాలని  వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.  పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667 ఇస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా 133 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులు కొనుగోలు కేంద్రాలుగా ఉన్నట్లు తెలిపారు.

కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని..  రైతులకు సకాలంలో, పారదర్శకంగా చెల్లింపులు జరపాలని తుమ్మల హెచ్చరించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే  టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-5779,  వాట్సాప్ సేవలకు 8897281111 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గిన సందర్భంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని చెప్పారు. పత్తిని విక్రయించే ముందు నాణ్యత, తేమ శాతాన్ని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>