కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనేంద్రగఢ్–కేల్హరి మార్గంలో పహాడీహంస్వాహి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను తక్షణమే అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

