నిర్మల్‌లో ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు

కలం, నిర్మల్: గిరిజన హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ జయంతి (Komaram Bheem Jayanti) ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్, అటవీశాఖ కార్యాలయాల ఎదురుగా ఉన్న కొమురం భీమ్ విగ్రహాలకు ఆదివాసీ నాయక్‌పోడు సేవా సంఘం, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్ మాట్లాడుతూ కొమురం భీమ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆ రోజుల్లో సాధారణ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చైన్‌గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాల పరిసర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అక్కడి మొక్కలకు నీళ్లు పోసే పరిస్థితి కూడా లేదని, విగ్రహాల పరిసరాలు మద్యం సేవించే వారికి అడ్డాగా మారుతున్నాయని ఆరోపించారు.

మద్యం సీసాలను అక్కడే పడేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఆదివాసీ వీరుడి విగ్రహాల వద్ద ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కల సంరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయక్‌పోడు ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ కార్యదర్శి శివశంకర్, నాయక్‌పోడు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సవీన్, రమేష్, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి గోవర్ధన్, జిల్లా బీజేపీ నాయకులు నర్సారెడ్డి, నైతం భీమ్‌రావు, సూర్యభాను, ఉయిక భీమ్‌రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>