వివేకానంద క్రికెట్‌ టోర్నీ విజేతగా పెబ్బేరు జట్టు

కలం, వనపర్తి: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన వివేకానంద క్రికెట్‌ టోర్నమెంట్‌ (Vivekananda Cricket Tournament) సీజన్‌–1 గురువారం ముగిసింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ పోటీల్లో 32 జట్లు పాల్గొన్నాయి. తొలి సెమీ ఫైనల్‌లో ఏదుట్ల జట్టు వనపర్తి రైజర్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. రెండో సెమీ ఫైనల్‌లో పెబ్బేరు జట్టు (Pebberu Team) పెద్దమందడిపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌లో ఏదుట్ల జట్టుపై పెబ్బేరు జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. ఏదుట్ల జట్టు రన్నరప్‌గా నిలిచింది.

విజేతలకు బహుమతుల ప్రదానం

ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరిసిల్ల సాయినాథ్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. విజేత పెబ్బేరు జట్టుకు ట్రోఫీతో పాటు రూ.40 వేల నగదు బహుమతి, రన్నరప్‌ ఏదుట్ల జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందించారు. టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుతో పాటు రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా టోర్నీ నిర్వహించినట్లు వివేకానంద క్రికెట్‌ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన నాయకులు, క్రీడాకారులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులు మనోజ్‌, జస్వంత్‌, క్రికెట్‌ సాయి, గజరాజుల తిరుమలేష్‌, వినయ్‌, వెంకీ, శ్రావణ్‌, రఫీ, జబ్బార్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>