ఆదివాసీలపై దాడులను సహించేది లేదు.. సంఘాల హెచ్చరిక

కలం, నిర్మల్: పెంబి (Pembi) మండలం లోతురా తండా, తాటిగూడకు చెందిన ఆదివాసీ మేకల కాపరి ఆత్రం శేషరావుపై దాడి (Shepherd Attack) చేసిన డీఆర్ఓ ప్రతాప్ నాయక్ పై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, రాంజీ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బొబడేకు వినతిపత్రం అందజేశారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే దాడులకు పాల్పడితే సహించేది లేదని సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బాధితుడికి న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఆదివాసీలపై వేధింపులకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, రాంజీ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Also Read : ఒకే రోజు రెండు గోల్డ్స్‌.. శీతల్ అదుర్స్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>