బెడిసికొట్టిన చోరీ ప్లాన్‌.. ల‌వ్ బ‌ర్డ్స్ అరెస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్: పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం ఓ ప్రేమ జంట దొంగతనాలను దారిగా ఎంచుకుంది. అయితే అనుభవం లేకపోవడంతో మొదటి చోరీలోనే పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్​లోని వనస్థలీపురం (Vanasthalipuram)లో జరిగింది. ఏపీలోని పల్నాడుకు చెందిన రమణారెడ్డి, వరలక్ష్మి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్​లోని గుర్రంగూడలో సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ, వీళ్ల దగ్గర డబ్బులు లేవు. పెళ్లి చేసుకునేందుకు కావాల్సిన డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.

రమణారెడ్డి, వరలక్ష్మిలు అక్టోబర్ 18న హస్తినాపురంలోని శ్రీ రాజరాజేశ్వరి గుడికి వచ్చారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా వస్తారు కాబట్టి, గోల్డ్​ చైన్స్​ వంటివి చోరీ చేయవచ్చని ఇద్దరూ ప్లాన్​ వేసుకున్నారు. ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చిన వృద్ధురాలు అందుగుల రాములమ్మ (66)ను ఫాలో అయ్యారు. ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలు వెంటనే కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

అనంతరం రాములమ్మ వనస్థలీపురం (Vanasthalipuram) పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత నిందితులైన ప్రేమ జంటను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి కోసం ఈ జంట చేసిన చోరీ ప్లాన్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Also Read : ఆసియా పారా గేమ్స్‌లో కపిల్ కుమార్‌కు రజతం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>