ఇన్ స్టాలోకి సోనియా గాంధీ.. స్పెషల్ రీల్!

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi)  ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. తన బయోగ్రఫీ Belonging: A Journey of Love పేరుతో రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేస్తున్న రీల్ షేర్ చేశారు. ప్రియాంక గాంధీ ఆమెకు స్వీట్ తినిపిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ రీల్‌కు ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్ స్టాలో సోనియా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫాలో అవుతున్నారు.

సోనియా (Sonia Gandhi) షేర్ చేసిన రీల్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లైక్ కొట్టారు. సోనియా పేరు మీద సోషల్ మీడియాలో అనేక అకౌంట్లు ఉండగా.. అధికారికంగా ఇన్ స్టాలో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేశారు. రాహుల్, ప్రియాంక ఇప్పటికే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో చురుగ్గా ఉంటున్నారు. రోజూ అనేక పోస్టులు పెడుతూ.. పార్టీ కార్యక్రమాలు, సందేశాలను కేడర్‌కు చేరవేస్తున్నారు.

Also Read : రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>