NBFC బ్యాంకులో భారీ సైబర్ దోపిడీ!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని NBFC సంస్థకు చెందిన బ్యాంకులో భారీ సైబర్ దోపిడీ (Cyber Fraud) జరిగింది. బేగంపేట బ్రాంచ్ ఖాతా నుంచి సుమారు రూ.3.34 కోట్లను సైబర్‌‌ నేరగాళ్లు కొట్టేశారు. 183 సార్లు 52 వేర్వేరు మ్యూల్ ఖాతాలకు ఈ నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ఈ చోరీ జరగడం గమనార్హం. సంస్థ మెయిన్ సర్వర్‌‌‌‌లోకి చొరబడి దోపిడీ చేశారు.

NBFC కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. NBFC అనేది నాన్ బ్యాంక్ ఫైనాన్స్​ కార్పొరేషన్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం రాయదుర్గంలో ఉండగా.. బేగంపేట బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>