కలం, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తూనే ఉన్నారు. బుధవారం చోటుచేసుకున్న డ్రోన్ దాడులకు (Houthi Drone Strike) సంబంధించిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయాలపాలయ్యారు. సౌదీ అరేబియా ఆగ్నేయ ప్రాంతంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ‘అరామ్కో’ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక షైబా చమురు క్షేత్రంపైకి దూసుకొచ్చిన డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ బలగాలు గాల్లోనే అడ్డుకున్నాయి.
అయితే, పేల్చివేసిన డ్రోన్ శకలాలు కింద పడటంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ మంత్రి వెల్లడించారు. మరణించిన వారిలో ఫిలిప్పీన్స్, నేపాల్ కు చెందిన వారు ఉండగా.. గాయపడిన వారిలో ఒక భారతీయుడు, పాకిస్తాన్ దేశస్థుడు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
సౌదీ నౌకా రవాణా మార్గాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా హౌతీలు ఇటీవలి కాలంలో వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఉద్రిక్తతల వేళ (Houthi Drone Strike) అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసి కీలక సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప సున్నిత ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పౌరులకు సూచించింది.

