కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్(MP Godam Nagesh)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి, ప్రధాని తమ శుభాకాంక్షలను తెలియజేశారు. గోడం నగేశ్‌కు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, దేశానికి అంకితభావంతో మరెన్నో సంవత్సరాలు సేవలందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. జన్మదినం గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ, నూతన ఉత్సాహంతో భవిష్యత్తులో ముందుకు సాగేందుకు మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోదీ తన లేఖలో పేర్కొన్నారు. సమాజానికి, దేశానికి గోడం నగేశ్ మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి, సుసంపన్నత, సమ్మిళిత వృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన నిరంతర కృషి దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

