డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కలం, వనపర్తి: వనపర్తి–చిట్యాల రహదారిపై (Wanaparthy–Chityal Road) చింతల హనుమాన్ ఆలయం సమీపంలోని పెట్రోల్ బంకు పక్కన బుధవారం రాత్రి సుమారు 8:35 గంటలకు బైక్ ప్రమాదం(Bike Accident) చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రత్యక్షంగా చూసిన స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు కేటీఎం బైక్ (TS 08 HM 2399)పై వేగంగా వస్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో వారి ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆటోలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరు తన పేరు గణేష్, తండ్రి పేరు నిరంజన్, స్వస్థలం పెబ్బేరు అని తెలిపినట్లు సమాచారం. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>