కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం–వరంగల్–నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలను పటిష్ఠం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) పిలుపునిచ్చారు. బుధవారం మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
అర్హులైన పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించి, క్షేత్రస్థాయిలో వారి సమస్యలు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రామసహాయం రఘురామ్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

