కిసాన్ నగర్‌లో ఘనంగా శమీపూజ.. రామ్‌లీలతో సందడి

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని 29వ డివిజన్ కిసాన్ నగర్‌లో (Kisan Nagar) కార్పొరేటర్ సోమిడి వేణు (Somidi Venu) ఆధ్వర్యంలో శమీపూజ, రామ్  లీలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హాజరై శమీపూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు అమ్మవారి ఆశీస్సులు పొందిన ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించిన కార్పొరేటర్ సోమిడి వేణును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శమీవృక్షానికి పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి జమ్మి పూజను ప్రారంభించారు.

రాత్రి విద్యుత్ దీపాల వెలుగులు, టపాసుల మోతల మధ్య నిర్వహించిన రామలీలా కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు బతుకమ్మ పాటలు, కోలాట గీతాలకు నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>