కలం, వెబ్ డెస్క్ : భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో తమ బ్యాటర్లకు తీవ్ర ముప్పు పొంచి ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా టీ20 సిరీస్ తొలి మ్యాచ్ జరగనున్న వేళ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ పిచ్‌లపై భువనేశ్వర్‌ను ఎదుర్కోవడం తమ జట్టుకు ఎంతో కష్టమని శాంట్నర్ చెప్పారు.
భారత ఫ్లాట్ పిచ్‌లపై కూడా బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగల నైపుణ్యం భువీ సొంతమని కొనియాడారు. ముఖ్యంగా కొత్త బంతితో భువనేశ్వర్ వేసే ఓవర్లు కివీస్ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారీ స్కోర్లు నమోదు కావడంతో బౌలర్లకు నరకం కనిపించిందని, కానీ ఇక్కడి పరిస్థితులు భువీకి బాగా కలిసివస్తాయని తెలిపారు.

