దసరాకు కిక్కే కిక్కు.. తెలంగాణలో సరికొత్త రికార్డు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ వేళ మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales)  కొత్త రికార్డులను సృష్టించాయి. పండుగకు ముందు వచ్చిన నాలుగు ప్రధాన పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.755 కోట్ల 14 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సీజన్‌లో మందు బాబుల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో గత దసరా సేల్స్ (రూ. 698 కోట్లు) రికార్డును దాటి మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదు అయింది.

ఈ అమ్మకాల తీరును పరిశీలిస్తే.. అక్టోబర్ 14న రూ.102.17 కోట్ల విక్రయాలు జరగగా, అక్టోబర్ 15న డిపోలకు సెలవు కారణంగా వ్యాపారం నిలిచిపోయింది. ఆ తర్వాత అక్టోబర్ 16న రూ.126.32 కోట్లు, అక్టోబర్ 17న రూ.223.25 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. మధ్యలో ఆదివారం (అక్టోబర్ 18) సెలవు దినం కావడంతో అమ్మకాల్లో కొంత మందగమనం కనిపించినప్పటికీ, దసరా పండుగకు సరిగ్గా ఒక్క రోజు ముందు (అక్టోబర్ 19న) మాత్రం విక్రయాలు అమాంతం గరిష్ట స్థాయికి చేరాయి. ఆ ఒక్క రోజులోనే ఏకంగా రూ.303 కోట్ల 40 లక్షల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం.

మొత్తంగా అక్టోబర్ మొదటి పందొమ్మిది రోజుల్లోనే రాష్ట్రంలో సుమారు రూ.2,054 కోట్లకు పైగా మద్యం వ్యాపారం జరిగిందని, ఇందులోనూ హార్డ్ డిస్ట్రిల్స్‌తో పాటు బీర్ల అమ్మకాలు భారీగా నమోదైనట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.దసరా పండుగ వేళ జరిగిన ఈ ఊహించని లావాదేవీలు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వృద్ధికి, ఎక్సైజ్ శాఖ ఆదాయానికి అత్యంత కీలకంగా మారాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>