కలం, స్పోర్ట్స్ : జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నాటౌట్‌గా 91 పరుగులు చేసిన అనంతరం భారత మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నింగ్స్ విరామ సమయంలో కామెంటేటర్లతో మాట్లాడుతూ ఆమె మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. గత 10 మ్యాచ్‌లుగా అర్థసెంచరీ లేక సతమతమవుతున్న హర్మన్‌ప్రీత్, ఆసియా కప్, ఆసియా క్రీడల్లోనూ బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. ఇటీవల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న ఆమె, ఈ మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఫామ్‌లోకి వచ్చారు.
సమీపంలో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో మాట్లాడే సమయంలో ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. స్వేచ్ఛగా ఆడుకోమని రామన్ ఇచ్చిన ప్రోత్సాహకర మాటలే తనను మళ్లీ గాడిలో పెట్టాయని చెబుతూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విధ్వంసక ఇన్నింగ్స్ వెనుక నెట్స్ ప్రాక్టీస్ ఎంతో ఉందన హర్మన్ వెల్లడించారు. ఆసియా క్రీడల తర్వాత తన బ్యాటింగ్ కోచ్ హిమాంశు భయ్యా తనపై చాలా కష్టపడ్డారని, ఈ మెరుపు ఇన్నింగ్స్ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.

