పత్తి రైతులకు కలెక్టర్ అలర్ట్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే!

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) వ్యవసాయ మార్కెట్‌యార్డులో 2026–27 పత్తి సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లు (Cotton Procurement) గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సీసీఐతో పాటు ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో కొనుగోళ్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు పత్తిని విక్రయించుకునేలా నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన పత్తిని మార్కెట్‌యార్డుకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

పత్తి విక్రయానికి ముందుగా ‘కపాస్ కిసాన్’ యాప్‌ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పత్తి నాణ్యత, తేమ తదితర అంశాల్లో రైతులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. పత్తి కొనుగోళ్ల ప్రారంభ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, పత్తి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ కమిటీ అధికారులు, హాజరుకావాలని కలెక్టర్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>