ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం..లోయలో పడిన ఆర్టీసీ బస్సు!

కలం, వెబ్ డెస్క్​ : జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా గుల్లీ గాలా ప్రాంతంలో విషాదం (Udhampur Bus Accident) చోటుచేసుకుంది. పేచౌండ్ ప్రాంతం నుంచి రామ్‌నగర్ వైపు వెళ్తున్న ఒక ప్రయాణికుల బస్సు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద స్థలి నుంచి క్షతగాత్రులను బయటకు తీసి, అత్యవసర వైద్య చికిత్స కోసం రామ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలంలో బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తున్నట్లు తెలిపారు.

Also Read : అజహరుద్దీన్ రికార్డు బద్దలు కొట్టిన బవుమా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>