బైంసాలో వైభవంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర

కలం, బైంసా: బైంసా (Bhainsa) పట్టణంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పురాణబజార్, భవానీ చౌక్ వద్ద నిర్వహించిన హారతి కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. విద్యుత్, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జనోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులు, ప్రజలు శాంతియుతంగా ఉత్సవాల్లో పాల్గొంటూ అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>