కలం, బైంసా : బైంసా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం (Bhainsa Road Accident) లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గడపాలే బాబు బైంసా పట్టణంలోని పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన ధమ్మచక్ర పరివర్తన ర్యాలీ బందోబస్తులో ఆయన పాల్గొన్నారు.
ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా వస్తున్న మరో బుల్లెట్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (Bhainsa Road Accident) బాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. హెడ్ కానిస్టేబుల్ గడపాలే బాబు మృతి పట్ల పోలీసు అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

