కలం, వెబ్ డెస్క్ : సుడాన్ లో వైమానిక దాడులు (Sudan Drone Strike) కలకలం రేపాయి. సుడాన్, దక్షిణ సుడాన్ మధ్య వివాదాస్పద అబ్యే ప్రాంతంలోని ఓ మార్కెట్‌పై సుడాన్ సైన్యం డ్రోన్ అటాక్ చేసినట్లు దక్షిణ సుడాన్ అధికారులు ఆరోపించారు. ఈ దాడిలో 150 మందికి పైగా మరణించినట్లు తెలిపారు. అబ్యే తాత్కాలిక సమాచార శాఖ మంత్రి యోహానా అకోల్ ఎన్గోర్ దాడిలో మృతుల సంఖ్య 153కు పెరిగిందని మంగళవారం ప్రకటించారు.
సుడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలైన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య 2023 ఏప్రిల్‌లో ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అబ్యే మార్కెట్‌పై దాడి (Sudan Drone Strike) జరిగినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లోని ఇంధన డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

