కలం, పెద్దపల్లి: రామగుండం ఎయిర్‌పోర్టు కోసం గత రెండేళ్లుగా పార్లమెంటులో పలుమార్లు ప్రశ్నించడంతో పాటు, వ్యక్తిగతంగా సైట్ విజిట్లు చేసి ప్రయత్నించినప్పటికీ, కలెక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు చేజారిపోయిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) విమర్శించారు. “కలెక్టరు మన జిల్లా ప్రజలకు పనిచేస్తున్నారా? లేక ప్రత్యేక మంత్రికి ఒక పీఏ వలె లెక్క పనిచేస్తున్నారా?” అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి రూ.50 లక్షలు చెల్లించినప్పటికీ ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
రామగుండం ఎయిర్‌పోర్టు కోసం పోరాటం ఆపేది లేదు అని స్పష్టం చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రి విషయంలోనూ కలెక్టర్, అధికారులు నిర్లక్ష్యం చేస్తే కార్మికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎయిర్‌పోర్టుతో ఎలా చేశారో, రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్‌తో కూడా అట్ల చేస్తే కార్మికుల శాపం తగులుతుందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.

