అర్హులకు పక్కాగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

రూ.40 వేల కోట్లతో..

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో 2.40 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఎంత ఖర్చయినా మూడో, నాలుగో విడతల్లో కూడా ఇళ్లు కట్టించి అర్హులందరికీ అందజేస్తామని భరోసా ఇచ్చారు.

200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ. 500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 73 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, కూసుమంచి మండల ఎంపీడీవో జశ్వంత్ కుమార్, తహశీల్దార్ సైదులు, హౌజింగ్ డీఈ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>