కలం, ఖమ్మం బ్యూరో: ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. ప్రతి నీటి బొట్టు పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) పిలుపునిచ్చారు. రైతులు వరి, మొక్కజొన్న లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగుకు దూరంగా ఉండాలని కోరారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని కోరారు. విద్యుత్‌ను కూడా అత్యంత బాధ్యతాయుతంగా పొదుపుగా వాడాలని సూచించారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మంచుకొండ లిఫ్ట్ ద్వారా..
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల (Minister Tummala) మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ జలాల ఆధారంగా మంచుకొండ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేసి ఈర్లపూడి చెరువును నింపుతామన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. భవిష్యత్తులో నీటితో పాటు విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు, మూగజీవాలకు, పశుపక్ష్యాదులకు తాగునీరు ఎంతో కీలకమని గుర్తుచేశారు. సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ రాయల నాగేశ్వర రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read : ప్రపంచ రికార్డు బద్దలు.. అదరగొట్టిన శీతల్, తోమన్!
Follow Us On: Youtube

