సుప్రీం కోర్టులో వైసీపీ అత్యవసర పిటిషన్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) సందర్భంగా పరిణామాల నేపథ్యంలో వైసీపీ (YSRCP)  సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని.. వెంటనే పోలీస్ రక్షణ కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరింది. అంతేగాకుండా నామినేషన్ల గడువును పొడిగించేలా ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించింది. అదనపు నామినేషన్ కేంద్రాలను పెంచడం, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టులో రెండు రోజుల్లో విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం.

హై కోర్టు తిరస్కరించడంతో..

వైసీపీ (YSRCP) వేసిన పిటిషన్‌ను ఏపీ హై కోర్టు తిరస్కరించడంతో వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నామినేషన్ల గడువు పెంచాలని వైసీపీ కోరగా.. ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో పెంచాలనే నిర్ణయం సముచితంగా ఉండదని కోర్టు అభిప్రాయపడింది. అంతేగాకుండా, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలన్న పిటిషన్‌ను కూడా కొట్టేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : మడకశిరలో జనసేనకు బిగ్ షాక్.. అసలేం జరిగింది?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>