కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF Assistance) కొండంత అండగా నిలుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్ (Mahabubnagar) అర్బన్ పరిధిలోని హబీబ్‌నగర్‌కు చెందిన రజియా బేగం (భర్త సయ్యద్ వికారుద్దీన్)కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.1,08,000 చెక్కును ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. రజియా బేగం దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లబ్ధిదారురాలికి అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలు, ఆపదలో ఉన్న బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంపై లబ్ధిదారు కుటుంబం హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఫ్యూచర్ సిటీలో కమిషనరేట్ ప్రారంభం!
Follow Us On : WhatsApp

