ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ అధికారులకు ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను రెవెన్యూ అదనపు కలెక్టర్ సావధానంగా విన్నారు. ప్రతి సమస్యను జాగ్రత్తగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. అధికారులు ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అన్నారు.

ప్రజావాణిలో మున్సిపల్, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, గిరిజన అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, విద్య, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 67 వినతులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.నిర్మల, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>