ధర్మపురిలో బీఆర్ఎస్‌లోకి 50 మంది యువకుల చేరిక

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలోకి భారీగా యువకులు చేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ( Former Minister Koppula Eshwar) సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని భావించి తాము బీఆర్ఎస్‌లో చేరినట్లు యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో కంటెం పవన్, కంటెం నవీన్, ఎంబడి శ్రీధర్, గర్వందుల ఆశిష్, ఎంబడి వంశీ, కంటెం గౌరయ్య, అల్లం రమేష్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు మరో పలువురు యువకులు బీఆర్ఎస్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కొత్తగా పార్టీలో చేరిన యువకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>