మహారాష్ట్ర నుంచి నిర్మల్‌కు బంతిపూల పరిమళం.. పండుగ వేళ జోరుగా విక్రయాలు!

కలం, నిర్మల్ : దసరా, దీపావళి పండుగల వేళ బంతిపూలకు (Marigold Flowers) డిమాండ్ పెరిగింది. పండుగ శోభను రెట్టింపు చేసే పసుపు, నారింజ రంగుల బంతిపూలతో ఇళ్లు, దుకాణ సముదాయాలను అలంకరించడంతో పాటు బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రానికి బంతిపూలు భారీగా తరలిస్తూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో జోరుగా విక్రయాలు జరుపుతున్నారు.

సరిహద్దు ప్రాంతాల నుంచి సరఫరా

నిర్మల్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర(Maharashtra)లోని హిమాయత్‌నగర్, బోకర్ ప్రాంతాల్లో రైతులు వందల ఎకరాల్లో బంతిపూలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయా ప్రాంతాల రైతులు తాము పండించిన పూలను నిర్మల్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పండుగల సమయంలో డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాలకు కూడా పూలను సరఫరా చేస్తున్నారు.

ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి నిర్మల్‌కు బంతిపూలు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి పూలు పెద్దఎత్తున వస్తుండటంతో స్థానిక మార్కెట్‌లో అందుబాటులో పెరిగింది. తాజాగా కిలో బంతిపూలను రూ.50కే విక్రయిస్తుండటంతో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.

ప్రధాన కూడళ్లలో సందడి..

నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్, పాత కలెక్టరేట్ కార్యాలయం సమీపం, జయశంకర్ చౌరస్తా, విద్యుత్ కార్యాలయం, వివేక్ చౌక్ తదితర ప్రాంతాల్లో బంతిపూల విక్రయాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. పండుగ అవసరాల కోసం ప్రజలు పూలను కొనుగోలు చేస్తుండటంతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>