దసరా శోభతో కళకళలాడుతున్న గద్వాల.. జనంతో కిక్కిరిసిన వీధులు

కలం,‌ జోగులాంబ గద్వాల: దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలో పండుగ సందడి తారాస్థాయికి చేరింది. పట్టణంలోని పాతబస్టాండ్, పాత కూరగాయల మార్కెట్, గాంధీచౌక్, ఎల్లప్ప‌ దవాఖాణ, రాజ వీధి తదితర ప్రధాన ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. విజయదశమి వేడుకల కోసం ప్రజలు కుటుంబ సమేతంగా వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు, పూలు, పండ్ల‌ మార్కెట్లకు పోటెత్తడంతో అన్ని ప్రాంతాలూ జనసంద్రంగా మారాయి.

​ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు

పండుగ రద్దీకి తగినట్లుగా వాహనాల రాకపోకలు విపరీతంగా పెరగడంతో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ముందుకు కదలక ప్రయాణికులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డుతున్నారు. అయితే, రద్దీ ఎక్కువగా ఉన్న కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పండుగ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read : చార్మినార్‌తో రాజీవ్ గాంధీకి విడదీయలేని అనుబంధం: TPCC చీఫ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>